- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ వర్సెస్ బీజేపీ కార్యకర్తలు: ‘భారత్ జోడో’ బస్సు ముట్టడి ఉద్రిక్తం
దిశ, నేషనల్ బ్యూరో : అసోంలోని సోనిత్‌పూర్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ బస్సును బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలతో మాట్లాడేందుకు స్వయంగా రాహుల్ గాంధీ బస్సులో నుంచి దిగారు. ఎందుకు ఘెరావ్ చేస్తున్నారంటూ వారి వైపు వెళ్లబోయారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది రాహుల్‌కు సర్దిచెప్పి బస్సులోకి తిరిగి ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు దగ్గరికి వచ్చిన బీజేపీ కార్యకర్తలలో దాదాపు 20 మంది చేతిలో కర్రలు కూడా ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను బస్సు నుంచి దిగగానే వారంతా అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు.
#WATCH | Sonitpur, Assam: Rahul Gandhi being moved inside the 'Bharat Jodo Nyay Yatra' bus by his security personnel and party workers as the Congress MP moved towards a large crowd of people that also included people with BJP flags.
— ANI (@ANI) January 21, 2024
Meanwhile, Congress has claimed that the… pic.twitter.com/iXOFtsk8PN
‘‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను చూసి కాంగ్రెస్ భయపడుతోందని వాళ్లు కలలు కంటున్నారు. వాళ్లు ఎన్ని పోస్టర్లు, ప్లకార్డులు కావాలంటే అన్ని చింపేయొచ్చు. మేం పట్టించుకోము. మేం ఎవరికీ భయపడం. ప్రధాని నరేంద్ర మోడీకి కానీ.. అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మకు కానీ భయపడం’’ అని రాహుల్ స్పష్టం చేశారు. ఇక అసోంలోని జుముగురిహాట్ వద్ద తాను ప్రయాణిస్తున్న వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ స్టిక్కర్లను చించివేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ‘‘వాళ్లు నా కారుపైకి నీళ్లు విసిరారు. మా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా మేం సంయమనం పాటించాం’’ అని ఆయన చెప్పారు.