పెళ్లి ఎప్పుడు? అని రాహుల్‌ను ప్రశ్నించిన యువతి.. తొలిసారి క్రేజీ ఆన్సర్ ఇచ్చిన ప్రతిపక్ష నేత

by Gantepaka Srikanth |
పెళ్లి ఎప్పుడు? అని రాహుల్‌ను ప్రశ్నించిన యువతి.. తొలిసారి క్రేజీ ఆన్సర్ ఇచ్చిన ప్రతిపక్ష నేత
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో అతి ముఖ్యమైనది ఆయన పెళ్లికి సంబంధించిన అంశమే. ఈ ప్రశ్నలను ఆయన ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకుండా.. ఫన్నీగా ఆన్సర్ చేస్తుంటారు. తాజాగా.. మరోసారి ఆయనకు పెళ్లి ప్రశ్న ఎదురైంది. ఇటీవల రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌కు చెందిన పలువురు విద్యార్థినులతో సరదాగా ముచ్చటించారు. ఈ సదర్భంగా పలువరు యువతులు.. పెళ్లి గురించి మీపై ఒత్తిడి చేయడం లేదా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి ఆయన నవ్వుతూ సదరు యువతులనే మీ పెళ్లి ఎప్పుడు అని అడిగారు.

పెళ్లి అనేది జీవితంలో తప్పని ఘట్టం అని.. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏం లేవు అని రాహుల్ బదులిచ్చారు. అనంతరం మీ పెళ్లికి మమ్మల్ని కూడా పిలవాలని యువతులు రాహుల్‌ను అడగ్గా.. తప్పకుండా పిలుస్తానని హామీ ఇచ్చారు. కాగా, 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 3 దశల్లో... సెప్టెంబరు 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 4న ఫలితాలు విడుదలవుతాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే. 2014లో జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఈ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం కాదు. ఆ ఎన్నికల్లో పీడీపీ 28, భారతీయ జనతా పార్టీ 25, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి.

Advertisement

Next Story