- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హేమంత్ సోరెన్ భార్యతో రాహుల్ భేటీ..
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాంచీలోని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ రోజు తెల్లవారుజామున రాష్ట్ర అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని చంపయ్ సోరెన్ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షను గెలుచుకున్న తర్వాత ఈ సమావేశం జరిగింది. హెచ్‌ఈసీ కాంప్లెక్స్‌లోని చారిత్రాత్మక షాహీద్ మైదాన్‌లో బహిరంగ ర్యాలీకి కొన్ని నిమిషాల ముందు రాహుల్ గాంధీ హేమంత్ సోరెన్ భార్యతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి పుష్పగుచ్చం అందజేశారు.
కాగా, భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హేమంత్ సోరెన్ స్థానంలో జార్ఖండ్ నూతన సీఎంగా చంపయ్ సొరెన్ కొనసాగనున్నారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి నేడు విశ్వాస పరీక్ష జరిగింది. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. 47 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం చంపాయ్ సోరెన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించగా.. 29 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.