స్వీట్ షాపులో రాహుల్ సందడి.. డివైడర్ దూకి మరీ సాహసం! ఎందుకో తెలుసా?

by Ramesh N |   ( Updated:2024-04-13 15:14:33.0  )
స్వీట్ షాపులో రాహుల్ సందడి.. డివైడర్ దూకి మరీ సాహసం! ఎందుకో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ శుక్రవారం తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పర్యటించారు. కోయంబత్తూరులో ఇండియా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే సభకు హాజరయ్యే ముందు డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ కోసం రాహుల్ స్వీట్లు తీసుకెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే కోయంబత్తూరు విమానాశ్రయం నుంచి మార్గమధ్య ఉన్న సింగనల్లూరు అనే ప్రాంతంలో తన కాన్వాయ్‌ను ఆపి.. డివైడర్ దూకి రోడ్డుకు అటువైపు ఉన్న స్వీట్ షాప్‌కు వెళ్లారు. షాప్‌లో రాహుల్ గాంధీ స్వీట్లు కొనుగోలు చేశారు.

రాహుల్ గాంధీ తన షాపుకు అనుకోకుండా విజిట్ చేయడంతో స్వీట్ షాప్ యజమాని బాబు అవాక్కయ్యారు. రాహుల్‌కు (గులాబ్) జామూన్ అంటే ఇష్టం కాబట్టి, అతను ఒక కిలో స్వీట్ కొన్నారని, మరోవైపు కొన్ని స్వీట్ శాంపిల్స్ టెస్ట్ చేశారని షాపు యజమాని తెలిపారు. 25 నిమిషాల పైగా రాహుల్ తన షాపులో ఉన్నారని స్వీట్ షాప్ యజమాని మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా వీడియో పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ ప్రముఖ స్వీట్ మైసూర్ పాక్‌ను కొనుగోలు చేశారని, దానిని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు బహుమతిగా ఇచ్చారని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed