Rahul Gandhi : చైనాను ప్రమోట్ చేయడమే రాహుల్‌గాంధీ పని : అసోం సీఎం హిమంత

by Hajipasha |
Rahul Gandhi : చైనాను ప్రమోట్ చేయడమే రాహుల్‌గాంధీ పని : అసోం సీఎం హిమంత
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్పత్తి రంగంలో చైనా రారాజు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అమెరికాలోని డల్లాస్‌లో చేసిన వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ మండిపడ్డారు. ఎక్కడపడితే అక్కడ భారతదేశాన్ని కించపరుస్తూ.. చైనాను ఆదర్శ దేశంగా పొగడడాన్నే రాహుల్‌గాంధీ పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

చైనాలో ప్రజాస్వామ్యం లేకున్నా, మతస్వేచ్ఛ లేకున్నా.. ఆ దేశాన్నే రాహుల్ పొగుడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. చైనాకు వంతపాడుతూ ఎందుకు మాట్లాడుతున్నారో దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ అగ్రనేతపై ఉందని అసోం సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్, చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని హిమంత చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed