'బ్రెజిల్ ‘జీ20’కి వస్తే పుతిన్‌‌ని అరెస్ట్ చేయం'.. బ్రెజిల్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
బ్రెజిల్ ‘జీ20’కి వస్తే పుతిన్‌‌ని అరెస్ట్ చేయం.. బ్రెజిల్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాకియో లులాడా సిల్వా కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసినప్పటికీ.. ఆయన భారత్‌లో జీ20 సదస్సుకు వచ్చి ఉంటే అరెస్టయ్యే ఛాన్సే ఉండేది కాదన్నారు. ‘‘త్వరలో రష్యాలో జరిగే బ్రిక్స్ సమావేశాలకు వెళ్తాను. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జరగనున్న జీ20 సదస్సుకు కూడా పుతిన్‌ని తప్పకుండా పిలుస్తాను’’ అని ఆయన వెల్లడించారు. ‘‘జీ20 సదస్సు కోసం మా దేశానికి పుతిన్ వస్తే అరెస్టు చేయం అని నేను హామీ ఇస్తున్నాను’’ అని లూయిజ్ ఇనాకియో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed