పంజాబ్ ఇప్పటికే చాలా కోల్పోయింది.. సిక్కు సంఘం

by Javid Pasha |
పంజాబ్ ఇప్పటికే చాలా కోల్పోయింది.. సిక్కు సంఘం
X

చంఢీగడ్: పంజాబ్‌లో పోలీసుల పహారా నేపథ్యంలో సిక్కు సంఘం కీలక హెచ్చరికలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖలీస్తానీ వేర్పాటువాదీ అమృతపాల్ సింగ్ ను పట్టుకునేందుకు అపరేషన్ నడుమ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉగ్రవాతవరణాన్ని సృష్టించే ప్రయత్నాలు అడ్డుకోవాలని అకల్ తఖ్త్ జథేదరర్ గియని హర్పీత్ సింగ్ కోరారు. పంజాబ్ ఇప్పటికే చాలా నష్టపోయిందని.. మెరుగైన భవిష్యతు కోసం ముందుకు వెళ్లాలని ప్రకటనలో తెలిపారు. గతంలో రాష్ట్రానికి అనేక గాయాలు అయ్యాయని.. ఏ ఒక్కరు కూడా వాటిని తగ్గించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు.

గతంలో యువతపై ప్రభుత్వాలు వివక్షను చూపించాయని, రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాయని మండిపడ్డారు. తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని, సిక్కుల దీర్ఘకాలిక మత, రాజకీయ మరియు ఆర్థిక సమస్యలను సరళీకృతం చేయాలన్నారు. సిక్కులలో పరాయి అనే భావనను తొలగించాలని హర్‌ప్రీత్ సింగ్ అన్నారు. మరోవైపు ఖలీస్తానీ నేత అమృత్ పాల్‌ను శనివారమే పట్టుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నప్పటికీ పరారీలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్రం సహాయంతో చేపట్టిన ప్రత్యేక అపరేషన్‌లో 78 మద్ధతు దారులను అదుపులోకి తీసుకున్నారు.


Advertisement

Next Story