పంజాబ్ ఉపఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం

by Shamantha N |
పంజాబ్ ఉపఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ లోని జలంధర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమ్ ఆద్మీపార్టీ గెలుపొందింది. ఆప్ నేత మొహిందర్ భగత్ ఉపఎన్నికలో విజయం సాధించారు. 64 ఏళ్ల మొహిందర్ భగత్ 37,325 ఓట్ల మోజారిటీతో గెలుపొందారు. బీజేపీకి చెందిన శీతల్ అంగురాల్, కాంగ్రెస్ కు చెందిన సురీందర్ కౌర్ లను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎస్సీ నియోజకవర్గం అయిన జలంధర్ వెస్ట్ కు ఆప్ తరఫున ఎమ్మెల్యేగా శీతల్ అంగురల్ గెలిచారు. కాగా.. మార్చిలో ఆయన బీజేపీలో చేరారు. దీంతో మార్చి 28న రాజీనామా చేశారు. జూన్ 3న రాజీనామాను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్‌కు లేఖ రాశారు. అయితే, శీతల్ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

బీజేపీ నుంచి ఆప్ లో చేరిన మొహిందర్ భగత్

ఇకపోతే, మొహిందర్ భగత్ గతేడాది బీజేపీ నుంచి ఆప్ లోకి చేరారు. మొహిందర్ భగత్ రెండుసార్లు జలంధర్ వెస్ట్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. అతను 2007-2011 కాలంలో మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన 1998-2001, 2017-2020 మధ్య కాలంలో బీజేపీ పంజాబ్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరోవైపు, పంజాబ్ శాసనసభలో 117 మంది సభ్యుల బలం ఉంది. అధికార పార్టీ ఆప్‌కు 90 మంది సభ్యులు ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 13, ఎస్ఏడీకి మూడు, బీజేపీకి 2, బీఎస్పీకి ఒకరు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed