- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Haryana: కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు: హర్యానా మాజీ సీఎం
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు తమ నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమని హర్యాన ప్రతిపక్ష నేత, మాజీ సీఈం భూపిందర్ సింగ్ హుడా అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రజల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. పరిణామాలు చూస్తే హర్యానాలో భారీ మెజారిటీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇదే సమయంలో హర్యానా ముఖ్యమంత్రి ఎవరనే అంశం గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకుంటున్నారని తెలిపారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గె హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కీలక ప్రకటనలు చేశారు. మహిళలు, రైతులు, యువత, పేదల కోసం ముఖ్యమైన హామీలిచ్చారు. వాటిలో పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, 2 లక్షల ఉద్యోగాలు, కులాల సర్వే, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 25 లక్షల ఉచిత వైద్యం వంటి అంశాలు ఉన్నాయి.