PSLV-C59 : పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం వాయిదా

by Y. Venkata Narasimha Reddy |
PSLV-C59 : పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చేపట్టాల్సిన పీఎస్ఎల్వీ- సీ59(PSLV-C59) ప్రయోగం వాయిదా (launch postponed) పడింది. ఉప గ్రహ మిషన్ లో సాంకేతిక లోపాన్ని(Technical error) గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైన కౌంట్ డౌన్ ప్రక్రియ 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ-సీ59ను మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఉపగ్రహంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అనూహ్యాంగా వాయిదా పడింది.

గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్ఎల్వీ-సీ59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ59 .. కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. వీటిని ఒకే కక్ష్యలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని విదేశీ ఉపగ్రహాలను మన ద్వారా ప్రయోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. ప్రపంచంలోనే ఈ ప్రయోగం తొలిసారి ఇస్రో చేపట్టడం విశేషం.

Advertisement

Next Story