సంచలనం: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు (వీడియో)

by GSrikanth |
సంచలనం: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో మరాఠా కోటా రిజర్వేషన్ల కోసం నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే నివాసానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. బీడ్ జిల్లాలోని మజాల్ గావ్ లోని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ఇటీవల ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే మరాఠా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు, మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు ఇవాళ అతడి నివాసానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన సమయంలో తాను తన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నామని ప్రకాశ్ చెప్పారు. ఈఘటనపై సీఎం ఏక్ నాథ్ షిండే రియాక్ట్ అయ్యారు. ఈ ఆందోళనలు ఏ మలుపు తిరుగుతాయో? ఎక్కడికి దారి తీస్తాయో మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ గమనించాలని సీఎం ట్వీట్ చేశారు. ఆందోళనలు తప్పు దిశగా సాగుతున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed