అటు జగన్.. ఇటు పవన్: తిరుపతి స్విమ్స్ వద్ద ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2025-01-09 13:58:43.0  )
అటు జగన్.. ఇటు పవన్: తిరుపతి స్విమ్స్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి(Tirupati Swims Hospital ) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు స్విమ్స్‌కు డిప్యూటీ సీఎం పవన్(Deputy Cm Pawan Kalyan), వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan) వెళ్లారు. ఆస్పత్రిలో బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో జగన్ కూడా ఆస్పత్రి ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అటు జగన్.. ఇటు పవన్ ఉండటంతో రెండు పార్టీల కార్యకర్తలు జనసేన, వైసీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది.

ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు.. జగన్‌ను అడ్డుకున్నారు. కొంత సమయం ఆగి రావాలని చెప్పడంతో జగన్ మరో ఆస్పత్రి వద్దకు వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించారు. స్విమ్స్ వద్ద పవన్ మీడియా సమావేశం అనంతరం తిరిగి జగన్‌ అక్కడి వెళ్లడంతో ఆయన్ను పోలీసులు ఆస్పత్రిలోకి అనుమతించారు. స్విమ్స్‌లో ఉన్న బాధితులను కూడా పరిమర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అటు జగన్, ఇటు పవన్ ఉండటంతో ఏం జరుగుతుందోనని ఆస్పత్రి వద్ద అందరూ టెన్షన్ పడ్డారు. చివరకు ఉద్రిక్తత సద్దుమనిగింది.

Advertisement

Next Story