- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వచ్చిందే టైం.. చేసిందే డ్యూటీ..
దిశ ,నేరేడుచర్ల (పాలకవీడు) : గత ప్రభుత్వం గ్రామాల్లోని ప్రజలకు వైద్యం అందించాలని ఉద్దేశంతో పల్లె దవఖానాలను ఏర్పాటు చేశారు. ఎంఎల్ హెచ్.పి మిగతా ఏఎన్ఎం సిబ్బంది అక్కడ వైద్యం అందించాలి. కానీ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ పల్లె దవఖానాలో భిన్న పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటలకు తీయాల్సిన హస్పిటల్ 10 గంటల వరకు కూడా తాళం తీయని పరిస్థితి ఉంది. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన వైద్యురాలు ఉదయం 9 గంటలకు వచ్చి.. సాయంత్రం 4 గంటల వరకు ఆ దావఖానలో ఉండాలి. కానీ ఇక్కడ సిబ్బంది వచ్చిందే టైం ..చేసిందే డ్యూటీ అన్నట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో ఉండారని భావించిన ప్రజలు..ఈ హాస్పిటల్ మీద నమ్మకం లేకనే ప్రైవేటు హాస్పిటల్ లను ఆర్.ఎం.పి నమ్ముకొని డబ్బులు ఇచ్చి మరి వైద్యం చేసుకుంటున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పర్యవేక్షణ లేకపోవడంతోనే పల్లె దవఖానా స్టాప్ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా డ్యూటీ పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పల్లె దవఖానాలో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల వరకు హాస్పటల్ కి వెళ్లి వైద్యం చేయాలని నేరేడుచర్ల పి ఎస్ సి పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ నాగిని అన్నారు.ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే..ఎక్కడికి వెళ్తున్నారో రిజిస్టర్ లో రాసి బయటకు వెళ్లాలన్నారు. కానీ ఇలా డ్యూటీకి నిర్లక్ష్యం వహిస్తే.. ఆ అధికారికి మెమో జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.