- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ, హైదరాబాద్ బ్యూరో : ఎస్సీ, ఎస్టీ ,బీసీ సాధారణ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ తరగతులలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటనలో కోరారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీ లోగా www.tgcet.cgg.gov.in లో ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు వెంట కులం,ఆదాయం, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు, ఫోటో సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు, ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో ఆరు నుంచి 9వ తరగతి లో ప్రవేశాలు, గౌలిదొడ్డిలోని టీ జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ , అలుగునూరు సీఓఈ లలో 9వ తరగతిలో ప్రవేశాలు ఉన్నాయని, ఖమ్మం, పరిగిలోని టీజీటీడబ్ల్యూఆర్ఈఎస్, ఎస్ఓఈ లలో 8వ తరగతిలో, రుక్మాపూర్ లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ సైనిక్ స్కూల్, మల్కాజ్గిరి ఫైన్ స్కూల్ లలో ఆరో తరగతిలో ప్రవేశాలు ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సర్టిఫికెట్స్ సత్వర జారి కోసం జిల్లా కలెక్టరేట్ లోని సహాయ కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.