ఎమోషనల్‌గా కట్టిపడేస్తున్న ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్.. సుకృతి నటనకు నెటిజన్లు ఫిదా

by Hamsa |
ఎమోషనల్‌గా కట్టిపడేస్తున్న ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్.. సుకృతి నటనకు నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నట వారసురాలు సుకృతి వేణి(Sukriti Veni) ‘గాంధీ తాత చెట్టు’(Gandhi TathaChettu) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ గోపీ టాకీస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించపడి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. జనవరి 24న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, ‘గాంధీ తాత చెట్టు’(Gandhi TathaChettu) సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఇక ట్రైలర్(Trailer) చూసుకున్నట్లైయితే.. ఇందులో అంతా గాంధీ అని పిలుస్తుండగా.. ఆ బాలిక మాత్రం పలకదు. అయితే ఓ చెట్టు కింద ఓ పెద్దాయన కూర్చుని ఆ బాలికను పిలిచి దీనిని నరికేస్తే నేను చచ్చినట్లే కాబట్టి నాకు మాటివ్వమని అంటాడు. దీంతో చెట్టును అలాగే ఉండేలా చేస్తాను అని తాతకి ప్రమాణం చేస్తుంది. ఈ క్రమంలోనే ఊరిలోకి ఫ్యాక్టరీ కట్టడానికి కొంతమంది వస్తారు. కానీ తాను మాత్రం తన తాతకి ఆ చెట్టుని కొట్టేయకుండా చూసుకుంటా అని మాటిస్తుంది. అయితే ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన వారు మాత్రం కొట్టేస్తుంటే.. తన జుట్టును కత్తిరించుకుంటుంది. అంతా ఆమెను ఓదారుస్తుంటే.. రగుపతి రాజారామ్(Ragupathi Rajaram) అని ఎమోషనల్‌గా చెప్తుంది. అయితే ఈ కథ అంతా ఆ చెట్టు మీదనే ఉన్నట్లు చూపించి ఎమోషనల్‌గా కట్టిపడేశారు. ప్రస్తుతం సుకృతి నటన నెటిజన్లను ఫిదా చేస్తోంది.



Advertisement

Next Story