Hisaab Barabar OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మాధవన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల

by Hamsa |
Hisaab Barabar OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మాధవన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: తమిళ్ స్టార్ నటుడు మాధవన్(Madhavan) నటించిన లేటెస్ట్ మూవీ ‘హిసాబ్ బరాబర్’. దీనికి అశ్విని ధిర్ దర్శకత్వం వహించారు. ఇందులో నీల్ నితిన్ ముఖేష్(Neil Nitin Mukesh), కృతి కుల్హరి, ఫైసల్ రషీద్, రాజేష్ జైస్, సుకుమార్ తుడు, అక్షయ్ భాగట్(Akshay Bhagat) వంటి వారు కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాను గత ఏడాది 55వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(Film Festival of India)లో కూడా ప్రదర్శిచారు. నవంబర్ 26న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది కానీ హిట్ అందుకోలేకపోయింది. తాజాగా, ‘హిసాబ్ బరాబర్’(Hisab Barabar) మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ జీ-5 సొంతం చేసుకోగా జనవరి 24 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఆసక్తిన పెంచారు.

Advertisement

Next Story