RG Kar Medical College: మాజీ ప్రిన్సిపల్ నివాసంలో ఈడీ సోదాలు

by Shamantha N |
RG Kar Medical College: మాజీ ప్రిన్సిపల్ నివాసంలో ఈడీ సోదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ (RG Kar Medical College and Hospital) మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్(Sandip Ghosh) నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఇకపోతే, గత నెలలో కోల్ కతా కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ దారుణ హత్య(Kolkata doctor murder case) జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో డాక్టర్ సందీప్ ఘోష్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా.. శుక్రవారం సందీప్ ఘోష్, అతని సహచరులకు సంబంధించిన 5-6 ప్రదేశాల్లో ఈడీ దాడులు చేపట్టింది. ఆర్జీ కర్ ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన్ ఛటర్జీ ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.

సందీప్ ఘోష్ పై ఆరోపణలు

ఆర్జీ కర్ ఆస్పత్రిలో ప్రిన్సిపల్ గా పనిచేసినప్పుడు జరిగిన అవకతవకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సందీప్ ఘోష్ ని మంగళవారం అరెస్టు చేసింది. ఎనిమిది రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం(West Bengal government) అతడ్ని సస్పెండ్ చేసింది. ఇకపోతే, ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించి సందీప్ ఘోష్ కు సీబీఐ రెండు రౌండ్ల పాలిగ్రాఫ్ పరీక్షలు చేసింది. ట్రైనీ డాక్టర్ డెడ్ బాడీని చూసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విఫలమయ్యారని సీబీఐ వాదిస్తోంది.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన నాన్ బెయిలబుల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, ఇండియన్ మెడికల్ కూడా సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని రద్దు చేసింది.

Advertisement

Next Story