- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అఫ్గాన్‌లో 25 మందిని చంపిన ప్రిన్స్ హ్యారీ.. ఆటో బయోగ్రఫీలో ఆసక్తికర విషయాలు
న్యూఢిల్లీ: మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ప్రిన్స్ హ్యారీ ఆత్మకథ స్పేర్‌లో పొందుపరిచిన విషయాలు బయటకొచ్చాయి. పలు అంతర్జాతీయ నివేదికలు వీటిని ప్రచురించాయి. ఇప్పటికే మేఘన్ విషయంలో తన సోదరుడు విలియంతో గొడవ జరిగిందనే విషయాన్ని వెల్లడించగా, సైనికుడిగా తన సాహాసాలను వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేసిన సమయంలో 25 మందిని మట్టు బెట్టినట్లు తెలిపారు. తాలిబన్లను సామాన్యులుగా చూడొద్దని తనకు ఆర్మీ నేర్పిందని అన్నారు. తాను చేసిన దాడులతో ఎలాంటి గర్వం గానీ సిగ్గు గానీ లేదని పేర్కొన్నారు. బ్రిటిష్ రాయల్ ఆర్మీలో ఫార్వార్డ్ ఎయిల్ కంట్రోలర్‌గా రెండు సార్లు ఆయన పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. రెండో సారి అఫ్ఘానిస్తాన్‌లో పనిచేసిన సమయంలో దాడులు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన ఆత్మకథలో తండ్రి కింగ్ చార్లెస్ 3తో జ్ఞాపకాలు, బంధం, అలాగే 1997లో కారు ప్రమాదంలో తల్లి ప్రిన్సెస్ డయానా మరణం, యుక్తవయసులో కొకైన్ వినియోగం గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.