- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగు సినీ రంగంలో విశిష్ట నటులు NTR: ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మరోసారి ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకయ్యనాయుడు, చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను స్మరించుకోగా.. తాజాగా ప్రధాని మోడీ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడు అని కొనియాడారు.
సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. ఎన్టీఆర్ కన్న సమాజం కోసం నిరంతరం పని చేస్తామని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సినీ, రాజకీయ రంగాల్లో ఎనలేకి కృషి చేసిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని సెంట్రల్ గవర్నమెంట్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు భారత రత్న విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రెండు తెలుగు స్టేట్‌లలో ఉత్కంఠ నెలకొంది.