- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీంకోర్టు సంచలన తీర్పుపై ప్రధాని మోడీ రియాక్షన్
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో కీలక తీర్పునిచ్చింది. ఇలాంటి కేసుల్లో చట్టసభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టసభల్లో ఓటు వేయడానికి, ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్న కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తూ 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచం రక్షింపబడదని న్యాయస్థానం పేర్కొంది. 1998 నాటి తీర్పు వివరణ రాజ్యాంగంలోని 105, 194 ఆర్టికల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. తాజాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోడీ స్పందించారు. సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లంచం కేసులో ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధారిస్తూ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచేలా కోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.