యోగా దినోత్సవం సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ కీలక నిర్ణయం!

by Ramesh Goud |
యోగా దినోత్సవం సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూడో సారి ప్రధాని గా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ యోగాకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. తన దినచర్యలో భాగంగా నిత్యం యోగ చేస్తుంటారని పలు సందర్భాల్లో చెప్పడం చూశాము. అయితే యోగ దినోత్సవం సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ యోగాలోని కొన్ని ఆసనాలకు సంబందించిన వీడియోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తున్నారు. గురువారం పోస్ట్ చేసిన వీడియోలో తడాసనం గురించి వివరిణ ఉంది. ఇందులో మోడీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ ఆ యోగాసనం ఎలా వేయాలో చూపిస్తోంది. అంతేగాక దాని వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలుపుతుంది.

ఈ తడాసనం శరీర భాగాలను క్రమపద్దతిలోకి తీసుకువచ్చి, శరీరాన్ని దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది అని చూపించారు. అంతేగాక ఏకాగ్రతను పెంచి, ఒత్తిడిని దూరం చేస్తుందని, నాడీ మండలాన్ని బలోపేతం చేసి, చాతి, వెన్నుముకలను దృఢ పరుస్తుందని తెలియజేస్తుంది. అలాగే ఎత్తు పెరగాలనే పిల్లలకు ఇది చక్కటి ఆసనమని చెబుతారు. ఇక పదేళ్ల క్రితం జూన్ 21 న యోగ దినోత్సవం జరుపుకోవాలని ఐరాసలో భారత్ ప్రతిపాదన పెట్టింది. దీన్ని అన్ని దేశాలు ఆమోదించడంతో ప్రతిఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed