- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వయనాడ్ బాధితులకు అండగా నిలవాలని ప్రధాని మోడీ పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా కేరళలోని వయనాడ్ లో ల్యాండ్‌స్లైడ్ జరిగి ఏకంగా 400 లకు పైగా ప్రజలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేరళ సీఎం పినరయి విజయన్ తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆయన వయనాడ్ లో బాధితుల క్యాంపుకు వెళ్ళారు. అక్కడ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాధితులను మోడీ పరామర్శించారు. అలాగే తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆగస్టు 30 రాత్రి జరిగిన ప్రకృతి విపత్తు గురించి కొంతమంది బాధితులు ప్రధాని మోడీతో చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు.
అనంతరం ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ.. వయనాడ్ ప్రకృతి విలయంలో చిక్కుకున్నవారికి అండగా నిలవాలి పిలుపునిచ్చారు. అలాగే వందల మంది ప్రజలు ప్రకృతి విపత్తులో తమ సర్వస్వాన్నీ కోల్పోయారని, వయనాడ్ రిలీఫ్ క్యాంపులో తాను బాధితులను కలిశానని. ప్రకృతి విపత్తు కారణంగా ఆ ప్రాంత ప్రజల కలలన్నీ కల్లలైపోయాయన్నారు.. బాధితులు చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారని..మనమంతా కలిసి పనిచేస్తే బాధితులకు అండగా ఉండగలుగుతామని.. రాష్ట్ర ప్రభుత్వం వయనాడ్ ల్యాండ్ స్లైడ్ నష్టం అంచనాలు పంపిన వెంటనే ప్రకృతి విపత్తు సాయం అందిస్తామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.