- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2047లో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్: ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రానున్న రోజుల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుందని.. ఇందుకు కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలవబోతుందని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం పార్లమెంట్ కొత్త భవనంలో రాజ్య సభ కొలుదీరింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ రోజు భారత దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని అన్నారు. పాత పార్లమెంట్ భవనంలో ఎన్నో విప్లవాత్మకమైన బిల్లులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు.
మేకిన్ ఇండియా దేశంలో గేమ్ ఛేంజర్‌గా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. 2047లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టామని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలోనే స్వాతంత్ర శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించుకుంటామన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని.. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకంగా ఉండబోతుందని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను కూడా రద్దు చేశామని గుర్తు చేశారు.