PM Modi: మహిళలకు గుడ్ న్యూస్.. కీలక పథకం ప్రారంభించిన ప్రధాని మోడీ

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-09 10:09:39.0  )
PM Modi: మహిళలకు గుడ్ న్యూస్.. కీలక పథకం ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ(PM MODI) శుభవార్త చెప్పారు. బీమా సఖి యోజన(Bima Sakhi Yojana) పథకాన్ని ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఈ పథకాన్ని సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకంతో ఎల్‌ఐసీ(LIC) కంపెనీ మహిళలకు శిక్షణ, ఉపాధి కల్పించనుంది. వచ్చే మూడేళ్లలో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేయనుంది. దీని ద్వారా మహిళలు బీమా రంగం గురించి తెలుసుకోవడమే కాకుండా బీమా పాలసీ(Insurance Policy)లను ఎలా అమ్మాలో అనే అంశంపై నైపుణ్యత సాధిస్తారు.

దీని ద్వారా వారు ఆర్థికంగా కూడా బలపడతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా బీమా సఖీ యోజన పథకం ప్రాథమిక ఉద్దేశం గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించడం. స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం. గ్రామాల్లో పేద కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక భరోసానిస్తూ ఉపాధిని కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మహిళల సాధికారతలో భాగంగా బీమా సఖీ యోజన పథకం తీసుకురావడంపై మహిళా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed