హత్రాస్ తొక్కిసలాటపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్బ్రాంతి

by Mahesh |   ( Updated:2024-07-02 13:19:25.0  )
హత్రాస్ తొక్కిసలాటపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్బ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 70 కి చేరుకుంది. అలాగే వందల సంఖ్యలో మహిళలు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. ఈ విషాద సంఘటన ఒక్కసారిగా యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కాగా ఈ ఘటనపై భారత ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీఎం యోగీ వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. అలాగే ఇంతటి విషాదానికి కారకులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.


అత్యంత ఘోర విషాదం.. తొక్కిసలాటలో 70 కి చేరిన మృతుల సంఖ్య

Advertisement

Next Story