- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CHPV Virus: గుజరాత్‌లో 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లల్లో అధికంగా AES వ్యాప్తి
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో మెదడును ప్రభావితం చేసే అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (AES) ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ 2024 ప్రారంభం నుండి జులై 31 నాటికి, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 148 అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ (AES) కేసులు వెలుగుచూడగా వాటిలో గుజరాత్‌లోని 24 జిల్లాల నుండి 140, అలాగే ప్రక్క రాష్టాలు మధ్యప్రదేశ్ నుండి 4, రాజస్థాన్ నుండి 3, మహారాష్ట్ర నుంచి 1 ఉన్నాయి. దాదాపు 59 మంది పిల్లల మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 51 కేసుల్లో ప్రధానంగా చండీపురా వైరస్ (CHPV) నిర్ధారణ అయింది. AESతో బాధపడుతున్న పిల్లల్లో 55-85 శాతం మరణాలకు CHPV అనే వైరస్ కారణం అవుతుంది.
AES అనేది మెదడు వాపు, చికాకు లేదా వాపుకు దారితీసే వ్యాధి. పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసులపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) డైరెక్టర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్‌లు పరిస్థితిని సంయుక్తంగా సమీక్షించారు. జులై 19 కి ముందు AES కేసులు ఎక్కువగా నమోదు కాగా, ఆ తరువాత నుంచి తగ్గడం మొదలైంది. గుజరాత్‌లో ఎక్కువగా కేసులు వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. క్రిమిసంహారక స్ప్రేయింగ్, స్కూళ్లు, కళాశాలల్లో ప్రచారాలు, వైద్య సిబ్బందికి శిక్షణ మొదలగు వాటిని నిర్వహిస్తున్నారు.