President murmu: టీచర్‌గా మారిన రాష్ట్రపతి ముర్ము..ఆ స్కూలులో విద్యార్థులకు పాఠాలు బోధన

by vinod kumar |
President murmu: టీచర్‌గా మారిన రాష్ట్రపతి ముర్ము..ఆ స్కూలులో విద్యార్థులకు పాఠాలు బోధన
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులకు పలు అంశాలపై పాఠాలు చెప్పారు. ముర్ము ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించి గురువారం నాటికి రెండేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో గడిపి ఈరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయంలోకి వెళ్లి స్టూడెంట్స్‌తో మాట్లాడారు. తొమ్మిదో తరగతిలోకి వెళ్లి గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులతో చర్చించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రతి విద్యార్థి తమ పుట్టిన రోజున మొక్కలు నాటాలని తెలిపారు.

అలాగే నీటి వృథాను అరికట్టాలని, వర్షపు నీటిని సంరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘ఏక్ పెద్ మా కే నామ్’ కార్యక్రమంపై కూడా విద్యార్థులతో డిస్కస్ చేశారు. కాగా, ఒడిశా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము 2022 జూలై 25న దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె అధ్యక్ష పదవికి ముందు 2015 నుంచి 20215 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed