మొట్టమొదటి స్వదేశీ క్యాన్సర్‌ థెరపీని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by S Gopi |
మొట్టమొదటి స్వదేశీ క్యాన్సర్‌ థెరపీని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. సకాలంలో చికిత్స అందకపోవడం వల్లనే మరణాలకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్‌లోనూ క్యాన్సర్ ప్రమాదం క్రమంగా పెరుగుతోంది. చాలామంది చివరి స్టేజ్‌లో క్యాన్సర్ గురించి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలను కోల్పోయే వారిని రక్షించేందుకు బాంబే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) సరికొత్త చికిత్సా విధానం తీసుకొచ్చింది. గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఐటీ బాంబేలో క్యాన్సర్ కోసం ఏర్పాటైన భారత మొట్టమొదటి స్వదేశీ జన్యు థెరపీ 'కార్‌ టీ సెల్‌ థెరపీ'ని ప్రారంభించారు. ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ జన్యూ ఆధారిత చికిత్సా విధానం ద్వారా వివిధ రకాల క్యాన్సర్‌లను నయం చేసేందుకు వీలవుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దేశంలో తొలి జన్యు థెరపీని ప్రారంభించడం క్యాన్సర్‌పై భారత్ చేస్తున్న పోరాటంలో ఒక పెద్ద ముందడుగు. కార్‌ టీ సెల్‌ థెరపీ అని పేరు పెట్టిన ఈ చికిత్సా విధానం సులభతరం, అలాగే తక్కువ ఖర్చుతో ఉండటం మొత్తం మానవాళికి కొత్త ఆశను అందిస్తుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed