ఢిల్లీ ఎయిర్ పోర్టులో పవర్ కట్.. బోర్డింగ్, చెక్-ఇన్ సౌకర్యాలకు బ్రేక్.. ప్రయాణికులు ఫైర్

by Ramesh N |
ఢిల్లీ ఎయిర్ పోర్టులో పవర్ కట్.. బోర్డింగ్, చెక్-ఇన్ సౌకర్యాలకు బ్రేక్.. ప్రయాణికులు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో నీటి సమస్యతో పాటు విద్యుత్ సమస్య కూడా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు అరగంట పాటూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయం కారణంగా బోర్డింగ్, చెక్ ఇన్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.

చెక్-ఇన్ కౌంటర్ల వెలుపల క్యూలో ఎదురు చూపులు చూస్తూ.. అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్ పోర్టు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, కరెంట్ పోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తర్వాత పవర్ రావడంతో సేవలు తిరిగి కొనసాగించారు. అయితే, ప్రయాణికులు తీవ్ర అసహనం గురవ్వడంతో ఎక్స్ వేదికగా పవర్ కట్ వీడియోలు షేర్ చేస్తున్నారు. దాదాపు రెండు గంటలు క్యూలోనే ఉన్నామని ఓ నెటిజన్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు, ఎయిర్ ఇండియా సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed