- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamil Nadu: దేవాలయం హోర్డింగ్‌పై పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఒక పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో కనిపించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో పార్వతి దేవతను పూజించే 'ఆడి' పండుగ జరుగుతుంది. ఈ వేడుకను కొద్ది రోజుల పాటు ప్రతి గ్రామంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో వేడుకల్లో హోర్డింగ్‌లను కూడా ఏర్పాటుచేశారు. అయితే కురువిమలైలోని నాగతమ్మన్, సెల్లియమ్మన్ ఆలయాల వద్ద పండుగ దీపాలతో పాటు హోర్డింగ్‌లను ఏర్పాటు చేయగా, వాటిలో దేవత ఫొటోలతో పాటు, మియా ఖలీఫా ఫొటో కూడా ఉంది. ఆమె, పండుగ సాంప్రదాయ నైవేద్యాలలో భాగమైన 'పాల్ కుడం' (పాల పాత్ర)ని ఎత్తుకుని తీసుకెళ్తున్నట్లుగా ఉంది. అలాగే ఆ హోర్డింగ్‌లో దానిని ఏర్పాటు చేసిన వారి ఫొటోలను, వాటి క్రింద తమ పేర్లను కూడా ముద్రించుకున్నారు. దీనిని చూసిన పలువరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోర్డింగ్‌కు సంబంధించిన ఫొటో వైరల్ కావడంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దానిని తొలగించారు.