హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

by Y.Nagarani |   ( Updated:2024-10-05 02:12:41.0  )
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. బరిలో 1031 మంది అభ్యర్థులు నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ జరుగనుంది. 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు, గొడవలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ బీజీపీ - కాంగ్రెస్ - ఆప్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఈసారి హర్యానాకు కాబోయే సీఎం తానేనని కుమారి సెల్జా ధీమా వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కింగ్ మేకర్ గా మారింది. అగ్నివీర్ పథకం, నిరుద్యోగం, రైతాంగం, నిత్యావసర ధరలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. కొద్దినెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 స్థానాలను గెలుచుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed