Horoscope: శుక్రుడి రాజ యోగం.. ఆ రాశుల వారికీ పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం

by Prasanna |
Horoscope: శుక్రుడి రాజ యోగం.. ఆ రాశుల వారికీ  పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్ : నవరాత్రులను దేశ వ్యాప్తంగా పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ఇక, నేడు మూడో రోజున శుక్రుడు, విశాఖ నక్షత్రంలో సంచారం చేయబోతున్నాడు. దీంతో, ఆ రాశుల వారి జీవితంలో ఊహించలేని మార్పులతో పాటు పెళ్లి కూడా కుదిరే అవకాశం ఉంది. విశాఖ నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడంతో రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారి పోనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

వృషభ రాశికి శుక్రుడు నక్షత్ర మార్పు కారణంగా జీవితంలో సంతోషకరంగా ఉంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు, అబ్బాయిలకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కన్యా రాశి

శుక్రుడు అనుగ్రహంతో ఈ రాశి వారు మొదలు పెట్టిన ప్రతీ పనిని పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టె వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి కానీ వారికీ వచ్చే ఏడాది ఉగాది లోపు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed