- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్ ఎన్నికలు... కొనసాగుతున్న మొదటి దశ పోలింగ్
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకుఈ ఓటింగ్ కొనసాగనుంది. సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని మొత్తం19 జిల్లాల్లో 89 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక పార్టీల పరంగా చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీ మొత్తం 89 స్థానాల్లో పోటీ పడుతుండగా.. ఆప్ 88 స్థానాల్లో పోటీ చేస్తోంది. మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 39 రాజకీయ పార్టీలకు చెందిన 788 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి దశ ఎన్నికల కోసం ఈసీ మొత్తం 1,432 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక 27 ఏళ్లుగా నిరాటంకంగా అధికారంలో కొనసాగుతోన్న బీజేపీకి ఈసారి గెలుపు అంత ఈజీ కాదు. ఆప్ ఎంట్రీతో గుజరాత్ ఎన్నికల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. బీజేపీ, కాంగ్రస్, ఆప్ మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది.