మధ్యప్రదేశ్‌కు ఈసీ అధికారులు.. ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు

by Vinod kumar |
మధ్యప్రదేశ్‌కు ఈసీ అధికారులు.. ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు
X

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో అక్టోబరు-నవంబరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల బృందం వచ్చే వారం మధ్యప్రదేశ్ వెళ్లనుంది. ఈ బృందం సోమవారం నుంచి రెండు రోజుల పాటు భోపాల్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మిజోరాం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలను కూడా ఈసీ అధికారులు ఇప్పటికే సందర్శించి సన్నాహాలను సమీక్షించారు. ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ అధికారులు భావిస్తున్నారు. మిజోరాం శాసన సభ గడువు ఈ ఏడాది డిసెంబర్‌లో ముగియనుంది.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌లతో కూడిన బృందం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, వివిధ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల అసెంబ్లీ గడువు జూన్ నెలలోని వేర్వేరు తేదీల్లో ముగియనుంది. దీంతో ఏప్రిల్-మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలతోనే పై మూడు రాష్ట్రాల ఎన్నికలు కూడా నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed