జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం

by karthikeya |   ( Updated:2024-09-18 03:33:53.0  )
జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభం
X

దిశ. వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్‌లో పోలింగ్ ప్రారంభమైంది. పదేళ్ల తర్వాత ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు (బుధవారం) మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో కశ్మీర్‌లో 16 స్థానాలకు, జమ్మూలో 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 24 స్థానాలకు 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్‌లో 23.27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అధికారులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్‌ఓసీ దగ్గరగా ఉన్న పోలింగ్ బూత్‌ల వద్ద భారీ భద్రత నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం అదనంగా 300 కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed