- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్లకు ప్రధాని మోడీ దీపావళి బహుమతులు
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి పండుగ సమీపిస్తోన్న నేపథ్యలో ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కానుకలు ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఇవాళ(గురువారం) హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని, హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా, చంబాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు దీపావళి బహుమతిగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఐఐఐటీ ఉనాను జాతికి అంకితం చేయనున్నారు. దీంతోపాటు హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై వరాల జల్లు కురిపించనున్నారు. అనంతరం రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 48 మెగావాట్ల చంజు-III జలవిద్యుత్ ప్రాజెక్ట్‌తోపాటు.. 30 మెగావాట్ల డియోతల్ చంజు జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఏటా 270 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాజెక్టుల నుంచి దాదాపు రూ. 110 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందగలదని అంచనాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :