- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి ఓటు ముఖ్యమే.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ టైంలో ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ సందేశాన్ని పంపారు. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతుందని అన్నారు.ప్రజలందరూ ఓటేయాలని కోరారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేసే వారు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ మరియు అస్సామీ భాషల్లో సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ప్రతీ ఓటు, ప్రతీ గొంతు ముఖ్యమైనదని పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికలతొలివిడతతో పాటు.. అరుణాచల్ ప్రదేశ్ లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో 16.63 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 35.67 లక్షల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు. 20-29 ఏళ్ల మధ్య వయస్సు గల 3.51 కోట్ల మంది యువ ఓటర్లు ఉండగా.. 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
ఇకపోతే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. ప్రతిపక్షాల ఇండియా కూటమి అదృష్టాన్ని మార్చుకోవాలని చూస్తుంది.