గియూ గ్రామానికి మొబైల్ నెట్ వర్క్.. గ్రామస్థులతో ఫోన్ లో మాట్లాడిన మోడీ

by Dishanational6 |
గియూ గ్రామానికి మొబైల్ నెట్ వర్క్.. గ్రామస్థులతో ఫోన్ లో మాట్లాడిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని గియు గ్రామానికి మొబైల్ నెట్ వర్క్ కనెక్టివిటీ ప్రారంభమైంది. గ్రామస్థులతో ఫోన్ లో తొలిసారిగా ప్రధాని మోడీ దాదాపు 13 నిమిషాలు సంభాషించారు. గియూలో మొబైల్ సేవలు ప్రారంభం కావడంతో గ్రామస్థులందరూ ఆనందంలో మునిగిపోయారు.

ప్రధాని మోడీ ఏం చెప్పారంటే..

దీపావళి సందర్భంగా గియూ ప్రాంతాన్ని సందర్శిస్తానని మోడీ గ్రామస్థులకు చెప్పారు. గియూ గ్రామాన్ని మొబైల్ నెట్ వర్క్ తో అనుసంధానించడం.. డిజిటల్ ఇండియా ప్రచారాన్ని వేగవంతం చేస్తుందని నొక్కి చెప్పారు. గ్రామాలకు విద్యుత్ సరఫరా తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానించడంపై దృష్టి సారిస్తుందన్నారు. తాను ప్రధానిగా అధికారం చేపట్టాక దాదాపు 18 వేల గ్రామాలకు విద్యుత్ సరఫరాలేదని గుర్తు చేశారు. 'వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్' ద్వారా సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించారు మోడీ. గత పాలకులు ఈ ప్రాంతాలను విస్మరించారని మండిపడ్డారు.

గియూ ప్రాంతాన్ని మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేస్తామని చెప్పినప్పుడు నమ్మలేదని.. అది జరిగాక ఆనందంగా ఉందన్నారు గ్రామస్థులు. గతంలో మొబైల్ వాడుకోవడానికి 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు.

Next Story

Most Viewed