PM Modi: కేవలం ఓట్ల కోసమే హిందుత్వాన్ని పాటిస్తున్నారు- మోడీ

by Shamantha N |
PM Modi: కేవలం ఓట్ల కోసమే హిందుత్వాన్ని పాటిస్తున్నారు- మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేవలం ఓట్ల కోసమే బీజేపీ హిందుత్వాన్ని పాటిస్తుందని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముంబై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై, మోడీపై విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని (PM Modi) పార్లమెంటుకు తెలియజేయాలని ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) కోరారు. ‘‘బంగ్లాదేశ్‌ (Bangladesh)లో హిందువులు అణచివేతకు గురవుతున్నారు. ఇస్కాన్ కార్యాలయాలను తగలబెట్టారు. అయినా ప్రధాని మోడీ మౌనంగానే ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధాన్ని (Russia-Ukraine war) ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని.. బంగ్లాదేశ్‌లో హింసను మాత్రం ఆపలేరా?’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశ్నించారు.

మోడీపై విమర్శలు

బంగ్లాలో జరుగుతున్న ఘటనలకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరి తరఫున మోడీని అభ్యర్థిస్తున్నానని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఐక్యత గురించి మన దేశంలో ప్రసంగాలు చేయడంతో ఉపయోగం లేదని.. భారతీయులను హింసకు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ ప్రపంచ దేశాల పర్యనటలో బిజీగా ఉన్నారని.. ఆయనకు ఎంపీలను కలిసే టైం కూడా లేదని ఎద్దేవా చేశారు. మోడీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తుండడం వల్ల ఆయనకు మణిపుర్ అల్లర్లు, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింస గురించి తెలిసి ఉండకపోవచ్చని చురకలు అన్నారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో సురక్షితంగా ఉన్నారని.. మరి ఆ దేశంలో కష్టాలు పడుతున్న హిందువుల సంగతి ఏంటి? అని ప్రధానిని ప్రశ్నించారు.

Advertisement

Next Story