PM Modi: రెండ్రోజుల కువైట్ పర్యటనకు వెళ్లిన మోడీ

by Shamantha N |
PM Modi: రెండ్రోజుల కువైట్ పర్యటనకు వెళ్లిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) కువైట్ పర్యటనకు బయల్దేరారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మోడీ కువైట్ వెళ్లారు. ఆ దేశ రాజు షేక్‌ మిషెల్‌ అల్‌అహ్మద్ అల్‌ జుబేర్‌ అల్‌ సహబ్ (Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah) ఆహ్వానం మేరకు మోడీ అక్కడ పర్యటించనున్నారు. గల్ఫ్ దేశంలో రెండ్రోజుల పర్యటన సందర్భంగా మోడీ 26వ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. షేక్ సాద్ అల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే 'హలా మోడీ' కార్యక్రమంలో మోడీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత ప్రధాని కువైట్‌కు వెళ్లడం 43 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈసందర్భంగా మోదీ ఆ దేశంలోని అగ్ర నాయకులతో పాటు అక్కడున్న భారతీయులను కలుసుకోనున్నారు. భారత కార్మిక శిబిరాన్ని సైతం సందర్శిస్తారు. మోడీ, కువైట్ రాజు మధ్య రక్షణ, వాణిజ్యంతో సహా పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగనున్నట్లు తెలుస్తోంది.

కార్మికుల సంక్షేమం

43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్ లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ ఛటర్జీ అన్నారు. "విదేశాలలో ఉన్న కార్మికులందరి సంక్షేమానికి భారత ప్రభుత్వం గణనీయమైన ప్రాముఖ్యతను ఇస్తుంది. కువైట్‌లో సుమారు పది లక్షల మందితో కూడిన సంఘం ఉంది. లేబర్ క్యాంపు సందర్శనతో ప్రభుత్వ ప్రాముఖ్యత ఏంటో తెలుస్తోంది. విదేశాలలో పని చేస్తున్న కార్మికులకు భారత్ అండగా ఉంటుంది" అని ఛటర్జీ అన్నారు. ప్రధాని మోడీ లేబర్ క్యాంప్‌ సందర్శనను హైలెట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed