కొత్త పార్లమెంట్ భవన పనులను పరిశీలించిన పీఎం మోడీ

by Javid Pasha |
కొత్త పార్లమెంట్ భవన పనులను పరిశీలించిన పీఎం మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ గురువారం పరిశీలించారు. దాదాపు గంటసేపు పార్లమెంట్ లోపల కలియ తిరుగుతూ పలు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో ఏమాత్రం తగ్గకుండా పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. కాగా పీఎం షెడ్యూల్ లో కొత్త పార్లమెంట్ విజిట్ లేదు. కానీ మోడీ సడెన్ గా కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడానికి రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది కంగారుపడ్డారు. ఇక కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story

Most Viewed