బీజేపీకి ప్రధాని మోడీ విరాళం.. ఎంతో తెలుసా ?

by Hajipasha |   ( Updated:2024-03-03 11:32:06.0  )
బీజేపీకి ప్రధాని మోడీ విరాళం.. ఎంతో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆదివారం రూ.2వేలు విరాళంగా ఇచ్చారు. PM NaMo యాప్ ద్వారా ఆయన తన విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన డిజిటల్ రసీదును తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం తాను ఈ విరాళం అందించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. బీజేపీకి విరాళాల సేకరణ కోసం చేపట్టిన ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నమో యాప్ ద్వారా ‘డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్’ కార్యక్రమానికి అందరూ తమవంతుగా విరాళాలను అందించాలని కోరారు. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం రాజకీయ పార్టీకి చెల్లించే విరాళాలకు కొన్ని మినహాయింపులు ఉంటాయనే విషయం రసీదులో ఉంది. ఈ విరాళాలు చెల్లించే కంపెనీలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ యూ/ఎస్ 80జీజీబీ కింద, ఇతరులు యూ/ఎస్ 80జీజీసీ కింద పలు మినహాయింపులను పొందొచ్చని రసీదులో పొందుపరిచారు. రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించేందుకు మోడీ సర్కారు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను గత నెలలోనే సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ స్కీమ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)ని ఉల్లంఘించేలా ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అందుకే ఇక బీజేపీ సహా రాజకీయ పార్టీలన్నీ మునుపటిలా ప్రత్యక్షంగా ప్రజలు, వ్యాపార సంస్థల నుంచి ఎన్నికల విరాళాల సేకరణకు రెడీ అయ్యాయి.


Advertisement

Next Story

Most Viewed