- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దక్షిణ భారతాన్ని ప్రత్యేక దేశం చేయాలా ? : ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ‘మోడీ కీ గ్యారంటీ’ని చూసి విపక్షాలు భయపడిపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ప్రజలకు ఇలాంటి వాగ్దానాలు చేయకుండా తనను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బిహార్‌లోని నవాడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్న భాష దేశాన్ని విభజించాలనుకునే వ్యక్తుల ఆలోచనను ప్రతిబింబిస్తోందన్నారు. ఆర్టికల్ 370పై ఇటీవల ఖర్గే చెప్పిన మాటలు విని తాను సిగ్గుపడుతున్నానన్నారు. ‘‘కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి అంటే చిన్న విషయం కాదు.. అలాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఆర్టికల్ 370కి రాజస్థాన్‌తో సంబంధం లేదని భావిస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ దేశంలో అంతర్భాగం కాదా? ఖర్గే ఆలోచన తుక్డె-తుక్డె గ్యాంగ్ ఆలోచనాధోరణికి అద్దం పడుతోంది’’ అని ప్రధాని విమర్శించారు. రాజస్థాన్, బిహార్ సహా దేశం నలుమూలల నుంచి భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించారని మోడీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని హామీ ఇచ్చి, దాన్ని తాము నెరవేర్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బుజ్జగింపు రాజకీయాలు ఉన్నాయని, ముస్లిం లీగ్ సూచనల ప్రకారం దాన్ని తయారు చేసినట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ప్రజా విరాళాలతో రామమందిరాన్ని నిర్మించినా..
ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజా విరాళాలతో రామమందిరాన్ని నిర్మించినప్పటికీ కాంగ్రెస్ నేతలు అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు హాజరుకాలేదని ప్రధాని పేర్కొన్నారు. ప్రజల పట్ల ఇండియా కూటమి నేతలకు ఇంత విద్వేషం ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని, దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని వాదిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్-ఆర్జేడీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తుక్డే తుక్డే గ్యాంగ్ అవినీతికి బానిసలుగా మారాయని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో వీరికి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలోనూ కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. ‘‘ఇండియా కూటమి రాజ్యాంగం గురించి మాట్లాడుతోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ విధానాన్ని జమ్మూకశ్మీర్‌లో ఎందుకు పూర్తిగా అమలు చేయలేకపోయారో వాళ్లు చెప్పాలి’’ అని ప్రశ్నించారు.