- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi: భారత ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం
దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్రమోడీ(PM Modi)కి మరో అరుదైన గౌరవం దక్కింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆయనకు కామన్ వెల్త్ ఆఫ్ డొమినికా(Commonwealth Of Dominica).. ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన "డొమినికా అవార్డ్ ఆఫ్ హనర్"(Dominica Award of Honour) తో సత్కరించింది. ఈ అవార్డును డొమికనా దేశ అధ్యక్షురాలు సిల్వనీ బర్టన్(Sylvanie Burton) అందజేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మోడీ.. తనకు 'డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్' ప్రదానం చేసినందుకు డొమినికా అధ్యక్షురాలు(President Of Dominica) సిల్వానీ బర్టన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గౌరవం భారతదేశంలోని నా సోదర సోదరీమణులకు(Brothers And Sisters In India) అంకితం(Dedicate) చేస్తున్నాని చెప్పారు. అంతేగాక ఇది మన దేశాల మధ్య విడదీయరాని బంధాన్ని కూడా సూచిస్తుందని మోడీ పేర్కొన్నారు. అనంతరం ఆ దేశ ప్రధాని(Prime Minister) రూజ్‌వెల్ట్ స్కెరిట్(Roosevelt Skerrit) భేటీ అయ్యారు. కృతజ్ఞతతో డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ని స్వీకరిస్తున్నానని చెబుతూ.. రాబోయే కాలంలో డొమినికాతో కలిసి పని చేస్తామని మోడీ స్పష్టం చేశారు.