- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశపు ఆస్తులపై తొలి హక్కు ముస్లింలదేనని మన్మోహన్ అన్నారు : మోడీ
నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ ముస్లింలను ఉద్దేశించి చేసిన ఎన్నికల ప్రసంగం రాజకీయంగా దుమారం రేపుతోంది. రాజస్థాన్ లోని బన్ స్వారాలో మోడీ చేసిన ఎన్నికల ప్రసంగంపై ఇండియా కూటమి నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. సమస్యల నుంచి దృష్టి మల్లించేందుకు మోడీ ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ..”తల్లుల్లారా, సోదరీమణుల్లారా.. మీ మంగళసూత్రాన్ని కూడా వాళ్ల వదరలరు.. ఇది అర్బన్ నక్సలైట్ల బుద్ధి. మీ డబ్బంతా చొరబాటుదారులకు పంపిణీ చేస్తారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటు దారులకు వెళ్లాలా? మీరు దీన్ని ఆమోదిస్తారా? మీరు కష్టపడి సంపాదించిన మీ ఆస్తిని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా? తల్లిదండ్రుల దగ్గరున్న బంగారం చూపించడానికి కాదు. అది వారి ఆత్మగౌరవానికి సంబంధించినది. వారి విలువ మంగళసూత్రం బంగారంలో లేదా దాని ధరలో లేదు. అది ఆమె జీవితంలోని కలలకు సంబంధించింది. మీరు దానిని లాక్కోవడం గురించి మాట్లాడుతున్నారా?" అని మోడీ అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు అని చెప్పిందని మండిపడ్డారు.
మోడీ ప్రసంగాన్ని నిజమని నిరూపిస్తూ బీజేపీ.. డిసెంబర్ 2006లోని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 22 సెకన్ల ప్రసంగాన్ని పోస్టు చేసింది. “కాంగ్రెస్ వారి స్వంత ప్రధానమంత్రిని నమ్మలేదా?" అని బీజేపీ పేర్కొంది.
2006 నాటి ప్రసంగంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. ఎస్సీ,ఎస్టీల కోసం వినూత్న ప్రణాళికలు తీసుకొచ్చామన్నారు. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, అభివృద్ధి ఫలాలలో సమానంగా పంచుకునే అధికారం ఉండేలా మేము వినూత్న ప్రణాళికలను రూపొందించాలి. వారికే తొలి హక్కు ఉండాలని పేర్కొన్నారు. దీనిపైనే అప్పట్లో వివాదం చెలరేగింది. కావాలనే కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని.. ప్రధాని ఉద్దేశం కాదని.. పీఎంవో వివరణ ఇచ్చాక.. ఆందోళనలు సద్దుమణిగాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోడీ విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల దృష్టిని సమస్యల నుండి మళ్లించాలని ప్రధాని ప్రస్తుతం కోరుకుంటున్నారని మండిపడ్డారు. తొలి దశ ఓటింగ్‌లో నిరాశకు గురైన నరేంద్ర మోడీ అబద్ధాలతో దిగజారిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన విప్లవాత్మక మేనిఫెస్టోకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు రాహుల్ గాంధీ. ప్రజలు ఇప్పుడు వారి సమస్యలపై ఓటు వేస్తారని అన్నారు. ఉపాధి, కుటుంబం మరియు భవిష్యత్తు కోసం ఓటు వేస్తారు అని చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో గెలవడానికి మోడీ అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సోషల్ మీడియా ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీపై మండిపడ్డారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. మన్మోహన్ గురించి అబద్ధాలు ప్రచారం చేసిన తీరు నీచ రాజకీయాలకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. ఇకపోతే, దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.