- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్‌కు శిక్ష విధించిన జడ్జీల ప్రమోషన్‌పై సుప్రీం కోర్టులో సవాల్..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జితో పాటు 68 మందికి ప్రమోషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌కు గుజరాత్ జడ్జి జస్టిస్ హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను మే 8వ తేదీని జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. 65 శాతం కోటా పద్ధతి ద్వారా ఈ 68 జడ్జిలకు పదోన్నతి కల్పించారు. అయితే సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ కలిగిన ఇద్దరు జుడీషియల్ అధికారులు రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాప్రయ మెహతా ఈ ప్రమోషన్లను సవాల్ చేశారు.
మార్చి 10వ తేదీన గుజరాత్ హై కోర్టు జారీ చేసిన జాబితాను, వారి నియామకానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. జుడీషియల్ అధికారుల నియామకానికి సంబంధించి మెరిట్, సినియారిటీ ఆధారంగా గుజరాత్ హై కోర్టు కొత్త జాబితాను విడుదల చేయాలని ఆ పిటిషన్లో డిమాండ్ చేశారు. మోడీ ఇంటిపేరు కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌కు సూరత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మకు చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్‌గా పదోన్నతి కల్పించారు. అంటే ఇక నుంచి ఆయన సూరత్ జిల్లా, సెషన్ కోర్టులో సీజేఎంగా వ్యవహరిస్తారు.