- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'హిగ్స్ బోసాన్' కణాల ఉనికిని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ మృతి
దిశ, నేషనల్ బ్యూరో: హిగ్స్ బోసాన్ కణాల ఉనికిని ప్రతిపాదించిన నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త పీటర్ హిగ్స్(94) మరణించినట్టు ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం మంగళవారం వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని యూనివర్శిటీ అధికారులు స్పష్టం చేశారు. పీటర్ హిగ్స్ 1964లో హిగ్స్ బోసాన్ అనే కొత్త కణం ఉనికిని ఊహంచారు. ఇది విశ్వంలోని పదార్థానికి మూలపదార్థం. అయితే లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లో ఆ కణం ఉనికిని నిర్ధారించడానికి దాదాపు 50 సంవత్సరాల సమయం పట్టింది. హిగ్స్ విశ్వం ద్రవ్యరాశిని ఎలా కలిగి ఉందో వివరించడంలో సహాయపడటానికి ప్రత్యేకమైన సైద్ధాంతిక పద్దతిని అనుసరించారు. తద్వారా భౌతిక శాస్త్రంలో గొప్ప పజిల్స్‌లో ఒకదాన్ని పరిష్కరించారు. దీనివల్లే పాఠ్యపుస్తకాలలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్ ప్లాంక్‌లతో పాటు ఆయనకు స్థానం దక్కింది. హిగ్స్ బోసాన్ లేదా "గాడ్ పార్టికల్"గా ప్రసిద్ధి చెందిన ఈ సిద్ధాంతం కారణంగానే పీటర్ హిగ్స్, బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్‌తో కలిసి 2013లో భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.