- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్లో ఆ ఫెసిలిటీ కోసం ఖర్చులు పేరెంట్సే భరించాలి..హైకోర్టు సంచలన నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: స్కూల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సౌకర్యం ఖర్చులను విద్యార్థుల తల్లిదండ్రలే భరించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూల్లో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. వివరాల్లోకి వెళితే..ఒక ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి క్లాస్‌లో ఏసీ కోసం నెలకు రూ.2000 వసూలు చేస్తున్నారని ఆ విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. విద్యార్థులకు ఏసీ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంపై ఉందని, వారి సొంత నిధుల నుంచి ఈ సౌకర్యం కల్పించాలంటూ పిల్ దాఖలు చేశాడు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై విచారణ జరిపింది. విద్యార్థులకు తరగతి గదుల్లో ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం కల్పించడం వంటి ఆర్థిక భారాన్ని కేవలం స్కూల్ యాజమాన్యమే భరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ల్యాబ్ వంటి ఇతర ఛార్జీలతో ఇది సమానమని, తల్లిదండ్రులే చెల్లించాలని తేల్చి చెప్పింది. స్కూల్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, ఇతర ఖర్చుల గురించి పేరెంట్స్ ముందస్తుగా తెలుసుకోవాలని సూచిస్తూ ఆ పిల్‌ను కొట్టివేసింది.