Panjab police: భారీ డ్రగ్స్ నెట్ వర్క్ చేధించిన పంజాబ్ పోలీసులు..9 మంది అరెస్ట్

by vinod kumar |
Panjab police: భారీ డ్రగ్స్ నెట్ వర్క్ చేధించిన పంజాబ్ పోలీసులు..9 మంది అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ పోలీసులు భారీ డ్రగ్స్ నెట్ వర్క్‌ను చేధించారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల నుంచి 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.11 లక్షల టాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ నార్కోటిక్ నెట్‌వర్క్‌లకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు. మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు లింకులపై ఆరా తీస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా మాట్లాడుతూ, రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి పంజాబ్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసిందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్ రవాణా చేసే ముఠాలను పట్టుకుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు భారీ నెట్ వర్క్ ను చేధించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed