- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్ట్రిక్ బస్సులు వారం ఫ్రీ.. మహిళలు, పురుషులు అందరికీ!
దిశ, నేషనల్ బ్యూరో : బంపర్ ఆఫర్ అంటే ఇదే.. మహిళలు, పురుషులు అనే తేడా లేదు. అందరికీ బస్సులో జర్నీ ఫ్రీ.. అయితే వారం రోజులే !! ఈ ఆఫర్ ఎక్కడబ్బా అనుకుంటున్నారా ? హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం పానిపట్ నగరంలో ఎలక్ట్రిక్ సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ బస్సులలో పానిపట్ నగర ప్రజలు వారంపాటు ఉచితంగా జర్నీ చేయొచ్చని ఆయన అనౌన్స్ చేశారు. నగరంలో అందుబాటులోకి తెచ్చిన మూడు ఎలక్ట్రిక్ బస్సులను ఉచిత ప్రయాణం కోసం ప్రజలు వాడుకోవచ్చన్నారు. త్వరలోనే మరో ఐదు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజల దైనందిన రవాణా అవసరాల కోసం ప్రైవేట్ వాహనాల కంటే ప్రభుత్వ వాహనాలే సేఫ్ అని సీఎం ఖట్టర్ చెప్పారు. పానిపట్‌లో అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రిక్ బస్సుల్లో వారం తర్వాతి నుంచి నగరవాసులు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 30 కిలోమీటర్ల పరిధిలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. బస్సు ఛార్జీ ప్రయాణించే దూరాన్ని బట్టి సగటున రూ.10 నుంచి రూ.50 వరకు ఉంటుంది.